Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్రభుత్వం, ఇంటర్ బోర్డు మొండి వైఖరి వల్ల ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం స్పందించని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్చేస్తూ సోమవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండలకార్యదర్శి పల్లె శివకుమార్, ఎన్ఎస్యుఐ మండల నాయకులు అంతటి వెంకటేశ్ , సంఘాల నాయకులు రాచకొండ భార్గవ్, నవీన్, శివ, శ్రావణ్, సాతిరి మనోజ్, రుద్రగోని మధు, రంగాపురం శ్రీకాంత్, మహేశ్, విఘ్నేశ్, చందు, సాయినాథ్, ప్రకాశ్, ధనుంజయ, సత్యం పాల్గొన్నారు.