Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రెండవ డోస్ వాక్సినేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి వైద్య అధికారులకు సూచించారు. సోమవారం బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ తేడాలేకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు సూచించారు. రెండవ డోస్ కోసం వంద రోజులు దాటిన వారిని గుర్తించి, వారికి ముందుగా సమాచారం ఇచ్చి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని తెలిపారు. అనంతరం ఆయన పోచంపల్లి మండలం జూలూరు సబ్ సెంటర్ సందర్శించి వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై ప్రజలకు వివరిస్తూ రెండో డోస్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని కోరారు. అనంతరం పోచంపల్లి మండలం ముక్తాపురం గ్రామం, పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిన్న కొండూరు గ్రామం ఆరోగ్య కేంద్రాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పరిపూర్ణ చారి, మున్సిపల్ కమిషనర్లు సుదర్శన్, నరసింహారెడ్డి, ఎం పి డి ఓ రాకేష్, వైద్యాధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.