Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
జీపీ కార్మికులకు 11వ పిఆర్సి ప్రకారం రూ. 21వేల కనీసవేతనం పెంచకపోతే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జేఏసి పిలుపుమేరకు సోమవారం కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామపంచాయతీ కార్మికులకు దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో పీఆర్సీ తరహ వేతనాలు, నిర్మాణాత్మక ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గాని ఇంత వరకూ అమలు చేయడం లేదని విమర్శించారు. గ్రామపంచాయతీ కార్మికులు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యాలను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేశారన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం పేరుతో కార్మికులను వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పోలె సాంబయ్య, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య,యూనియన్ జిల్లా నాయకులు పోతే పాక వినోద్ కుమార్, ఎన్ నరసింహ, పోన్న అంజయ్య ఏర్పుల సైదులు, టి శ్రీనివాస్,ఎర్ర అరుణ, ఏ కోటయ్య, జానయ్య, వి.హనుమంత్, సైదులు, దానయ్య , రామలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.