Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రతీక్ పౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవలు
అ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటట్రడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు . సోమవారం కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 10వ వర్థంతి సందర్భంగా కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి బాలుర జూనియర్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని డీఐజీ ఏవి రంగనాథ్ తో కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. చాలామంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరక్త దానం చేయడం అంటే ప్రాణదానం చేయటమే అన్నారు. జాతీయ రహదారులపై నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. తలేసీమియా పిల్లలకు రక్తం అవసరమున్న వారు కూడా ఈ కార్యక్రమనికి హాజరయ్యారని తెలిపారు. ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని జిల్లా కేంద్రంలో పది కోట్లతో కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి అందులో 2000వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు,రైతులకు ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తున్నామని పట్టణంలో నాగార్జున డిగ్రీ కళాశాల శిథిలావస్థకు చేరుకుందని ప్రభుత్వ అనుమతి తో త్వరలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నూతన భావనాన్ని నిర్మిస్తామని తెలిపారు. రహదారి పై ప్రమాదాల దష్ట్యా నూతన అంబులెన్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెంటిలేటర్ కలిగి ఉన్న అంబులెన్స్ లు తెలంగాణ బాడర్ వరకు సేవలు అందిస్తాయని అన్నారు. పేద విద్యార్థులు చుదువుకోవలన్న ఆసక్తి ఉంటే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రక్తదాన శిబిరంలో వెయ్యి మంది కార్యకర్తలు రక్తదానం చేశారు .అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు కళాశాల ప్రిన్సిపాల్ గోనారెడ్డి ,నల్లగొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ,ఎంపీపీ మణి మధ్య సుమన్ ,పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కాంగ్రెస్ లీడర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.