Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కనుముక్కల గ్రామాన్ని అభివద్ధిలో ముందుకు తీసుకెళ్లిన సర్పంచ్ పాక కవిత వెంకటేశం
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు చెప్పిన విధంగా కనుముక్కల గ్రామంలో ప్రథమ సర్పంచి పాక రాములు ఏకగ్రీవంగా ఎన్నికై అనేక అభివద్ధి పనులు చేపట్టి ప్రజలకు ఆప్తుడుగా నిలిచాడు. అతని కుమారుడు పాక వెంకటేశం చిన్ననాటి నుండి విద్యార్థి దశలోనే ప్రజా సేవ చేయాలని దడ సంకల్పంతో పార్టీలకతీతంగా ప్రజాసేవలో అంకితభావంతో ప్రజలతో మమేకంగా ఉండి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసిన ఏకైక నాయకుడు పాక వెంకటేశం. పాక వారి కుటుంబం వాళ్లతండ్రి నుండి రాజకీయం ప్రజల శ్రేయస్సు కోసం గ్రామాలభివద్ధి కోసం ఎంతో కషి చేసిన పరిస్థితి. కనుముక్కల గ్రామంలో గొర్రె కాపలా సంఘం అధ్యక్షుడిగా, వార్డు సభ్యునిగా, సర్పంచిగా, ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీ పదవులు చేపట్టి గ్రామంలో అనేక అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రజలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడు గ్రామ సర్పంచ్ పాక కవిత వెంకటేశం. కనుముక్కల గ్రామంలోని అనేక పాఠశాలలో విద్యార్థులకు చేర్పించి పాఠశాల అభివద్ధికి చిన్నారుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులను ఏర్పాటు చేసే ఉన్నత విద్యలను అభివద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కషి చేశారు. అభివద్ధి పనులు చేపట్టి సీసీ రోడ్లు ,డ్రైనేజీ వాటర్ ,స్రీట్ లైట్లు ,శ్మశాన వాటికలు గ్రామాలలోని పార్టీలకతీతంగా నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూరే విధంగా అహర్నిశలు కషి చేశారు .కనుముక్కల గ్రామానికి 2009లో వార్డు సభ్యునిగా 2013లో సర్పంచిగా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ గ్రామంలో ఇరువైపులా మొక్కలు పచ్చదనాన్ని పెంచి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సర్పంచ్ పాక కవిత వెంకటేశం ఎంతో కషి చేశారు .2018లో భీమనపల్లి ఎంపీటీసీగా అధిక మెజార్టీతో గెలుపొంది గత సంవత్సరం అకాల వర్షాలకు జలాల్పురం మెహర్ నగర్ గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోవడంతో వెంటనే స్పందించి 24 గంటల్లో రోడ్లను పూర్తిచేసి మెహర్ నగర్ గ్రామానికి మంచినీళ్లు నిలిచిపోవడంతో ట్యాంకర్ల ద్వారా కుటుంబాలకు అందజేసి విద్యుత్ లైన్లను వెంటనే పునరుద్ధరించి సమస్యను పరిష్కరించడంలో కీలకమైన వ్యక్తి వెంకటేశం భారీ వర్షాలకు తెగిపోయిన పిల్లాయిపల్లి కాలువ మరమ్మతుల పనులు చేయించి రైతులకు ఇచ్చిన సమయంలోగా కాలువ ద్వారా సాగునీరు అందించడం కోసం అహర్నిశలు కషి చేశారు. ప్రజల సమస్యలను తమ సమస్యగా భావించి సమస్య పరిష్కారం కోసం వైస్ ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మండల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కషి చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజల ఆదరిస్తే మరిన్ని పదవులు చేపట్టి సేవ చేసే అవకాశం కల్పిస్తే గ్రామాలను మరింత అభివద్ధి చేస్తాను, సుమారు 3 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు.