Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
అమరుల త్యాగాలు ఎప్పటికీ వధా కాబోవని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సింగిల్‌విండో మాజీ చైర్మెన్ జక్కిడి ప్రతాప్‌రెడ్డి ఏడో వర్థంతి సందర్భంగా ప్రతాప్‌రెడ్డి స్మారక భవన నిర్మాణ పనులకు సీతారాములుతోపాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ శంకుస్థాపన చేశారు. ప్రతాప్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించిన సభలో చెరుపల్లి మాట్లాడారు. ప్రతాప్‌రెడ్డి 18 సంవత్సరాలు సింగిల్‌విండో ఛైర్మన్‌గా ఉండి నిజాయితీ నిబద్దత కలిగిన ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందారన్నారు. చౌటుప్పల్ సింగిల్‌విండో కార్యాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు. రైతాంగ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కషిచేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో కందాల రంగారెడ్డి తర్వాత అమరజీవులు ప్రతాప్‌రెడ్డి, తిరందాసు గోపిలు అనేక ఉద్యమాలు నిర్వహించి సీపీఐ(ఎం)ను బలోపేతం చేశారన్నారు. పేదలు ఉన్నంత వరకు ఎర్రజెండా ఉంటుందన్నారు. సీపీఐ(ఎం)కు ఉన్న చరిత్ర ఇతర పార్టీలకు లేదన్నారు. అమరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కషిచేయాలన్నారు. పార్టీ మండలకార్యదర్శి గంగదేవి సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, ఎమ్‌డి.పాషా, బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, ప్రతాప్‌రెడ్డి కుమారుడు జక్కిడి కొండల్‌రెడ్డి, నాయకులు రాగీరు కిష్టయ్య, చీరిక సంజీవరెడ్డి, జక్కిడి రాంరెడ్డి, తడక మోహన్, ఆకుల ధర్మయ్య, చెన్నబోయిన వెంకటేశం, దేప రాజు, బొజ్జ బాలయ్య, బోయ యాదయ్య, ఎస్కె.మదార్, జక్కిడి అంజిరెడ్డి, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, కొండె శ్రీశైలం, ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎర్రజెండా పాలనే ప్రజలకు శ్రేయస్కరం
-ఎండి.జహంగీర్, సీపీఐ(యం)జిల్లా కార్యదర్శి
- పెద్దకొండూరులోజక్కిడి ప్రతాప్ రెడ్డి 7 వ వర్ధంతి సభ
చౌటుప్పల్‌రూరల్ : సమసమాజ పాలన కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ అన్నారు. దోపిడీకి గురవుతున్న ప్రజలను అభ్యుదయం వైపు నడిపించడానికి ఎంతో మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు. మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో సింగిల్ విండో మాజీ చైర్మెన్,పార్టీ నాయకులు జక్కిడి ప్రతాప్ రెడ్డి 7వ వర్థంతిని నిర్వహించారు.గ్రామంలోని స్మారక స్థూపంపై ఉన్న అరుణపతకాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంపై ఉన్న జెండాను జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి ఆవిష్కరించారు.ప్రతాప్ రెడ్డి చిత్రపటానికి జహంగీర్ ,ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్దకొండూరు గ్రామ పరిధిలోని సాయి యాదాద్రి సేవ ఆశ్రమం(వద్దాశ్రమం)లో కుటుంబ సభ్యులతో కలిసి నాయకులు అన్నదానం చేశారు.అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ జక్కిడి ప్రతాప్ రెడ్డి ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) ఉద్యమాన్ని నిర్మించిన కందాల రంగారెడ్డి అడుగుజాడల్లో పని చేస్తూ రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారన్నారు.సింగిల్ విండో చైర్మెన్‌గా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలోనే వన్నె తెచ్చిన ఆదర్శనీయుడని కొనియాడారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలు చేసిందని అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ దేశంలో మతోన్మాద విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి ఈ ప్రాంత రైతుల కోసం పనిచేశారని అన్నారు.పిలాయి పల్లి కాల్వ సాధించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాయితి రమేష్,కుటుంబ సభ్యులు జక్కిడి కొండల్ రెడ్డి,పూలమ్మ,గోపాల్ రెడ్డి,జయేందర్ రెడ్డి,సంతోష్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రొడ్డ అంజయ్య,జిల్లా కమిటీ సభ్యులు యండి.పాషా,బూర్గు కష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు,మాజీ సింగిల్ విండో చైర్మన్ చిరిక సంజీవరెడ్డి,పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహ,మండల కార్యదర్శివర్గ సభ్యులు రాగిరు కిష్టయ్య,బొజ్జ బాలయ్య,నాయకులుజక్కిడి రాంరెడ్డి, పిసాటి నాగరాజు రెడ్డి, బోయ యాదయ్య, ఎస్.కె మాదార్,ఆకుల ధర్మయ్య,కొంతం శ్రీనివాస్ రెడ్డి,అంతటి అశోక్,సామిడి అంజిరెడ్డి, కొండే శ్రీశైలం,చిదుగుళ్ల శంకరయ్య, యాదమ్మ, బోరేం శ్రీనివాస్ రెడ్డి, డీివైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు సామిడి నాగరాజు రెడ్డి,అంజిరెడ్డి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.