Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేటి నుంచి సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా మహాసభలు
అ మహాసభలకు 500మంది పార్టీ ప్రతినిధులు రాక
అ 21న ప్రతినిధుల సభ, 22న నూతన కమిటి ఎన్నిక
అ హాజరుకానున్న తమ్మినేటి, చెరుపల్లి, జూలకంటి
నవ తెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ అయిన హూజుర్నగర్లోసీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా రెండో మహాసభలు ప్రారంభం కానున్నాయి. 21,22న జరిగే ఈ మహాసభలకు ఇప్పటికే పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. మహాసభల విజయవంతం కోసం గత 16 రోజులుగా ఆహ్వాన సంఘం కృషిచేసుంది. పట్టణ కేంద్రంలో ప్రతి చోట ఎర్రజెండాలు, తోరణాలు , ఏర్పాటు చేయడంతో ఎర్రపూల తోట మాదిరిగా మున్సిపల్ కేంద్రం మారిపోయింది. సభలకు వచ్చే పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ అన్ని కేంద్రాలలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులు ఇక్కడే ఉండే పార్టీ నాయకత్వానికి బోజనాలు, వసతి తదితర ఏర్పాట్లు సభ ప్రాంగణం సమీపంలోనే ఏర్పాటు చేశారు.
పట్టణంలో భారీ ర్యాలీ...
జిల్లా మహాసభలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 21న హుజుర్నగర్ పట్టణ కేంద్రంలోని అడ్డరోడ్డు నుంచి శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాల్ వరకు ఎర్రచొక్కాలతో భారీ ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటలకు అడ్డరోడ్డు సెంటర్ ఇందిరాగాందీ బొమ్మ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన మొదలవుతుండగా సభ ప్రాంగణం వరకు సాగుతుంది.ఈ ప్రదర్వనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తదితర నాయకులు పాల్గొంటారు.
ప్రతినిధుల సభ
21న ర్యాలీ అనంతరం ప్రారంభ సభ జరుగుతుంది. ఈ సభకు ముఖ్యఅతిధులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు , రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీసభ్యులు మల్లు లక్ష్మి హాజరై ప్రసంగిస్తారు. అనంతరం మద్యాహానం 12గంటలకు శ్రీలక్ష్మి ఫంక్షన్హాల్లో (కామ్రేడ్ కుక్కడపు ప్రసాద్‌నగర్, కామ్రేడ్ వర్ధెల్లి బుచ్చిరాములు, కోంజేటి నారాయణ ప్రాంగణంలో ) ప్రతినిధుల మహాసభ ప్రారంభమవుతుంది. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు సుమారు 500 వరకు హాజరు కానున్నారు. మధ్యాహ్నభోజనం తర్వాత జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి నాలుగేండ్లుగా జిల్లాలో సమస్యలు, వాటిపై పార్టీ, ప్రజా సంఘాలు చేసిన ఉద్యమాలు, వచ్చిన ఫలితాలను పేర్కొంటూ తన నివేదికను ప్రవేశపెడతారు. అనంతరం మండలవారిగా పార్టీ కార్యక్రమాలపై చర్చలు చేస్తారు. జిల్లా మహాసభల కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 22న మొదటి రోజు చేసిన చర్చల ఫలితాలను మండలవారిగా అందజేస్తారు. అనంతరం జిల్లా కార్యదర్శి వాటిపై సమాదానాలు చెపుతారు. అంతేగాకుండా పార్టీ తీర్మానాలను కూడా ప్రవేశ పెడతారు.సాయంత్రం జిల్లా నూతన కమిటిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత జిల్లా మహాసభల కార్యక్రమాలు ముగుస్తాయి.
మహాసభలను జయప్రదం చేయండి
మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సూర్యాపేట
ఈనెల 21, 22తేదీల్లో హుజుర్నగర్ పట్టణంలో జరిగే సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజ సమస్యలలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నాం. . ప్రతి మండలం నుంచి పార్టీ శ్రేణులు ప్రారంభసభకు పెద్దఎత్తున హాజరు కావాలి. 21న జరిగే భారీ ప్రదర్శనకు పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలి.