Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి
మాజీఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యం కొనేంత వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారని అట్టి పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు దొంగనాటకాలు ఆడుతున్నారని, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలన్నారు. లేకపోతే రైతులు క్షమించరని హెచ్చరించారు. వరి సాగు చేయడం వల్ల రైతులు కార్మికులకు, హమాలీలకు ఉపాధి దొరుకుతుందని, దీనివల్ల రైస్ ఇండిస్టీ నడుస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే టీఆర్ఎస్, బీజేపీ నాయకులను ఊర్లోకి రాకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఆ రెండు పార్టీలకు రైతులు చావు డప్పు కొడతారని జోస్యం చెప్పారు. ధాన్యం కోనేంత వరకు రైతుల పక్షాన కలిసొచ్చే పార్టీలతో బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పారు. దాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్ , జిల్లా నాయకులు రవి నాయక్, ఆయుబ్, పాతని శ్రీనివాస్ పాల్గొన్నారు.