Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
పేదల కోసం పోరాడితే అక్రమంగా అరెస్టులు చేస్తారా అని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం జిల్లా సెక్రెటరీ కొత్తపల్లి శివకుమార్ ప్రశ్నించారు.సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కుడకుడ శివారులో నివాస స్థలం కోసం 126సర్వే నెంబర్లో 500 మంది నిరుపేదలు గుడిసెలు వేయగా పార్టీ జిల్లా సెక్రటరి కొత్తపల్లి శివకుమార్‌ను ఇంటివద్దనే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ విష్ణు ఆధ్వర్యంలో గుడిసెల వద్దకు వచ్చి పీఓడబ్య్లూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక , నాయకులు ఆరుట్ల శంకర్‌రెడ్డి, దొంతమళ్ళ రామన్న, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సింహాద్రి, గోపి, లక్ష్మి, మరియమ్మ, చంద్రకళతో పాటు సుమారు 300 మందిని స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేండ్లుగా నిలువ నీడ లేని నిరుపేదలకు ఒక వందగజాల ఇంటిస్థలం కోసం అనేక సార్లు కలెక్టర్‌కు విన్నవించినా గతంలో రెండు సార్లు గుడిసెలు వేశామన్నారు.అప్పుడు కూడా ఇదే విదంగా అరెస్ట్ చేశారు. ఐనా మంత్రిగారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏ మాత్రం స్పందించకుండా పేదలే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మళ్ళీ గుడిసెలు వేస్తె అక్రమంగా అరెస్టులు చేసి స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు.అధికార పార్టీ నాయకులు రూ.కోట్లవిలువైన భూములు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం పేదల కోసం పోరాడే న్యూడెమోక్రసీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.దీనిని ప్రతి ఒక్కరూ ఖండిచాలని విజ్ఞప్తి చేశారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా పేదలకు ఇండ్లస్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆపేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో పరశురాం, శ్రీను, మధుసూదన్, ఆశన్న, వెంకన్న, బాలాజీ పాల్గొన్నారు.