Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని మల్లిఖార్జున హైస్కూల్లో బుధవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి మల్లిఖార్జున విద్యాసంస్థల అధినేత మారంపల్లి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎఫ్ఓ వెంకటాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.