Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ,విద్యాభివద్ధికి దివిస్ పరిశ్రమ అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎంపీటీసీ జెల్లా ఈశ్వరమ్మ,రాజమ్మలు అన్నారు. మండలంలోని కొయ్యలగూడెం ప్రభుత్వ పాఠశాలల్లో రూ.29,18,485 లు,దేవలమ్మ నాగరం ప్రభుత్వ పాఠశాలల్లో రూ.12,23,644 ల విలువైన డెస్క్ బెంచీలు, నోట్ బుక్స్,బ్యాగ్ లు,హార్లిక్స్, వాటర్ ఫిల్టర్లను దివిస్ పరిశ్రమ యాజమాన్యం బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యా అభివద్ధి జరగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ కె.అశోక్, మాజీ సర్పంచ్ మాచర్ల కష్ణ,ప్రధానోపాధ్యాయులు నిర్మల,సురేందర్ రెడ్డి,టి.పద్మ,రేణుక,శివజ్యోతి,దివిస్ ప్రతినిధులు వల్లూరి వెంకటరాజు,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.