Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డులో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనాన్ని బుధవారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి తన వంతుగా రెండు లక్షల రూపాయలు సహకరించానన్నారు. భవన నిర్మాణానికి దాతలు అందించిన సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు, వైస చైర్మెన్ బత్తుల శ్రీశైలం, మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ బొడిగె అరుణ, దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, కర్నాటి శంకరయ్య, భీమిడి మోహన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బాలరాజు, కానుగుల వెంకటయ్య, ఆగయ్య, నారాయణరెడ్డి, ముటుకులోజు పాండురంగాచారి, రాజయ్య పాల్గొన్నారు.