Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మండల కేంద్రంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో రైల్వే గేట్నుండి బస్టాండ్ వరకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలో దేశప్రజలు సుభిక్షంగా జీవిస్తూ బీజేపీ వైపు ఆకర్షితులౌతున్నారనే అక్కసుతో టీిఆర్ఎస్ నేతలు కండ్లు మండి పిచ్చిపనులను చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .