Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో బుగ్గ నవీన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఉద్యోగాలు కల్పించకపోవడం వల్ల అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 90 2650 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు బండారుశ్రవణ్, నాగరాజు రెడ్డి, పగడాల శివ, భాగ్య, మల్లేష్ పాల్గొన్నారు.