Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -రామన్నపేట
రైతులు అప్పటికప్పుడు మారుతున్న కాలానికనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పంట మార్పిడి విధానాన్ని అలవర్చుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఏర్పాటుచేసిన సాగు పద్ధతులు వ్యవసాయ ప్రదర్శనశాలను ఆమె సందర్శించి, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలను శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ అధికారులు గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం మూలంగా రైతులకు మంచి ఉపయోగం కలగడమే కాకుండా అవగాహన పెంపొందించుకుంటారని తెలిపారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సేంద్రియ, తుంపర, సూక్ష్మ, బిందు, డ్రం షిడ్, యాజమాన్య పద్ధతులను ప్రదర్శనశాలల ద్వారా రైతులకు అర్థమయ్యేలా ఏర్పాటు చేశారని తెలిపారు. హైదరాబాద్ దగ్గరగా ఉన్నందున రైతులు తాము పండించిన పంటలను ఎగుమతి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మధు శేఖర్, నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి జి.అన్నపూర్ణ, హెచ్వో సౌమ్య, తహసిల్దార్ వలికొండ ఆంజనేయులు, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జడ్పిటిసి పూన్న లక్ష్మి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు బత్తుల కష్ణ గౌడ్, ఎంపిటిసి గోరి గే నరసింహ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి యాదగిరి రావు, ఏఈ ఓ లు శ్రీనివాస్, కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.