Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రెండు రోజులపాటు కొనసాగిన సభలు
అ జిల్లా కార్యదర్శిగా నాగార్జున్‌రెడ్డి ఎన్నిక
నవతెలంగాణ - హుజూర్‌నగర్‌టౌన్
హుజూర్‌నగర్‌లోని శ్రీ లక్ష్మి ఫంక్షన్హాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సభలో పార్టీ నిర్మాణం, ప్రజాసమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గత మహాసభ నుంచి ఇప్పటి వరకూ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలు, చేసిన కార్యక్రమాల నివేదికను పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి మొదటి రోజు ప్రవేశ పెట్టారు. ఆయన ప్రవేశ పెట్టిన నివేదికతో పాటు మండలాల వారిగా జరిగిన కృషిపై ప్రతినిధులు మాట్లాడారు. మహాసభలకు హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మొదటి రోజు మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ అభివృద్ధికి కావాల్సిన అవకాశాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కూడా మాట్లాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాల గురించి వివరించారు. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులూ కల్గకుండా ఆహ్వాన కమిటీ అన్ని ఏర్పాట్లూ చేసింది.
సీపీఐ(ఎం)లో పలువురి చేరిక
హుజూర్నగర్ పట్టణానికి చెందిన పలువురు యువకులు బుధవారం ఆయా పార్టీలకు రాజీనామా చేసి సీపీఐ(ఎం)లో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కండువాలు కప్పి ఆహ్వానించారు. వరుసగా రెండో రోజు కూడా పార్టీలో పలువురు చేరడంతో నాయకుల్లో నూతనుత్తేజం కనిపించింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శిగా రెండోసారి మల్లు నాగార్జున్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఆయనతో పాటు 39 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.రవినాయక్, నెమ్మాది వెంకటేశ్వర్లు, కే.యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, నాయకులు నాగారపు పాండు, పులి చింతల వెంకట్‌రెడ్డి, కే.అనంత ప్రకాష్, నగేష్, ఎస్కె.యాకోబ్, పాండునాయక్, పి.హుస్సేన్, పి.శేఖర్‌రావు, ములకలపల్లి సీతయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, దుగ్గి బ్రహ్మం, శీలం శ్రీను, జేవీఎల్ చిన్నం వీరమల్లు, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.