Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నవతెలంగాణ' వార్తకు స్పందన
నవతెలంగాణ-నల్లగొండ
ఖాజీరామారంలో లోపించిన పారిశుధ్యం, ఒకరికి కుట్టి ఇండ్లంతా చుట్టిపట్టించుకోని వైద్య శిబిరం అనే వార్తాకథనం సోమవారం 'నవతెలంగాణ' దినపత్రికలో ప్రచురణ కావడంతో వైద్య అధికారులు అప్రమత్త మయ్యారు.బుధవారం ఆ గ్రామంలో జిల్లా వైద్యాధికారులు మెగా వైద్యశిబిరం నిర్వహించి ఇంటింటికి తిరిగి పరిశీలన చేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్‌రెడ్డి గ్రామ ప్రజలకు డెంగ్యూ పట్ల అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ అనూష ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు.డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్‌రెడ్డి హెల్త్‌క్యాంపును సందర్శించి ప్రజలకు డెంగ్యూ పట్ల అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మున్వర్ షబ్బీర్బాబా, పంచాయతీ కార్యదర్శి బొంతు అజరుకుమార్ ,ఎసీహెచ్పీ డాక్టర్ భాస్కర్, జిల్లా మలేరియా అధికారి రుద్రాక్ష దుర్గయ్య,హెల్త్ ఆఫీసర్ సోమయ్య, మైక్రోబయాలజిస్ట్ ఉపేందర్, ఏఎన్ఎంలు అండాలు, హసీనా,ఆశావర్కర్లు దుర్గా,కవితా పాల్గొన్నారు.