Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక్రిశాట్ సైంటిస్టు సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
మానవమనుగడకు గణితం ఎంతో అవ సరమని ఇక్రిశాట్ సైంటిస్టు డాక్టర్ సుధీర్‌రెడ్డి అన్నారు.బుధవారం మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయంలోని సైన్స్కళాశాలకు చెందిన మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ లెజెండ్ శ్రీనివాస రామానుజన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ కౌన్సిల్ ఫర్సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ డీఎస్పీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో రీసెంట్ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితం లేనిదే మానవజాతి మనుగడ ప్రశ్నార్థకమన్నారు.ఈనాడు ప్రతి సబ్జెక్టు గణితం యొక్క ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు.గణితంలోని నమూనాల తోటి రీసెర్చ్ కూడా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.ఆయన సిగల్ ప్రాసెసింగ్ స్పేస్, దానికి సంబంధించిన అంశాల్లో గణితం యొక్క ప్రాము ఖ్యతను గురించి సవివరంగా వివరిం చారు.ఈసీమెంబర్ డాక్టర్ కె శ్రీదేవి, ప్రొఫెసర్ రాఘవ, కోఆర్డినేటర్గు డాక్టర్ జి .ఉపేందర్‌రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ హైమావతి, వైస్‌చైర్మన్ డాక్టర్ మద్దిలేటి, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీనివాస్, కిరణ్‌కుమార్, రాంచంద్రు, పాల్గొన్నారు.