Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఈ నెల 26న జరిగే సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయ వంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. గురువారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి చవుడబోయినా కనకయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి గట్టి పాముల శ్రీనివాస,్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాటురి జానమ్మ ,నాయకులు తెడ్డు ఆంజనేయులు, ఆంజనేయులు ,తదితరులు పాల్గొన్నారు .