Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐదుగురికి గాయాలు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
లారీని బస్సు ఢకొీన్న సంఘటనలో ఐదుగురికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని జమ్మాపురం శివారులోని స్టేజీ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్-2 కు చెందిన ఆర్టీసీ బస్ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో జమ్మాపురం శివారులో స్టేజి వద్ద అదే మార్గంలో వెళుతున్న నవత ట్రాన్స్పోర్ట్ కు చెందిన లారీని వెనుక వైపు నుంచి బస్సు ఢ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఐదుగురికి గాయాలయ్యాయి. బస్సు కండక్టర్ స్వాతికి తీవ్ర గాయాలయ్యాయి. అంతకు ముందే ఇదే ప్రదేశంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢ కొట్టడంతో లారీ గమనించి సడన్ బ్రేక్ వేశాడు. వెనుక నుంచి వస్తున్న బస్సు అకస్మాత్తుగా నిలిపే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సైదులు తెలిపారు.