Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మండలంలోని గుండ్రపల్లి గ్రామ ఉప సర్పంచ్ కసాల వెంకట్ రెడ్డిపై గత నెల 11 న నల్లగొండ ఆర్డీవోకు పదిమంది వార్డు సభ్యులకు గాను ఆరుగురు అవిశ్వాస తీర్మానం కొరకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా గురువారం ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో గుండ్రంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆరుగురు వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి చేతులెత్తి మద్దతు తెలిపారు. ఆర్డీఓ ఆవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు ప్రకటించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించి అనంతరం కొత్త ఉప సర్పంచ్ ఎన్నిక తేదీని ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈఅవిశ్వాస తీర్మానంలో గుండ్రపల్లి గ్రామ సర్పంచ్ తీగల సుభాష్, 3వ వార్డు, అనీమల్ల సత్యనారాయణ, 4వ వార్డు, పెండ్యాల గీత, 5వవార్డు, తిరుమణి శ్రీనివాస్, 6వవార్డు, తరి యల్లమ్మ, 8వవార్డు, కురిపాటి రోజమ్మ, 10వ వార్డు, అనుముల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొమ్మిదో వార్డు సభ్యుడు ,గ్రామ ఉప సర్పంచ్ కాసాల వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహేందర్ రెడ్డి ఎంపీడీవో యాకూబ్ నాయక్ ఎంపీఓ స్వరూపరాణి పంచాయతీ కార్యదర్శి అశోక్ రెడ్డి పాల్గొన్నారు.