Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రం పరిధిలోని రెండో వార్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గదులు, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి . పాఠశాల ప్రాంగణం పరిసర ప్రాంతాలు పూర్తిగా చెట్లు పొదలతో నిండిపోయాయి. విద్యార్థులు వెళ్లడానికి కూడా వీల్లేకుండా ఉంది. టాయిలెట్స్, వాటర్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు.