Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర కమిటీ సభ్యులు
కొండమడుగు నరసింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రైతాంగ, కార్మిక, వ్యవసాయ కూలీలు, పేదలు వత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం)ను ప్రజలు అన్ని విధాలుగా ఆదరించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ కోరారు. గురువారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో జనవరి 22 నుంచి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం ,పీడిత ప్రజల విముక్తి కోసం ఎర్రజెండా నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. పాలకులు అవలంబిస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్ శాఖ కార్యదర్శి కూకుట్ల కష్ణ, సభ్యులు కొండ లక్ష్మయ్య, పుల్లెల మల్లేశం, కాసారం మల్లయ్య తో కలసి గ్రామంలో గ్రామ సర్పంచ్ మాకొల్ల సత్యం, మాజీ సర్పంచ్ కొండ స్వామి, ఉప సర్పంచ్ కొండ వాణి నందు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్, డాక్టర్ నరహరి, గ్రామ ప్రముఖులు రాంపల్లి వెంకటేష్, జక్కుల మల్లేశం, గౌటీ సతీష్, బోడుసు కొండయ్య, గజ్జి పాల్గొన్నారు.