Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
జనవరి 30న పోచంపల్లి నుంచి చేపట్టనున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ ముగ బసవ కోరారు. గురువారం పురపాలక పట్టణ కేంద్రంలోని గ్రామీణ పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రం వరకు 42 రోజుల పాటు 600 కి.మీలు పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం తడక వెంకటేశం రమేష్ జగన్ రెడ్డి, పాల్గొన్నారు.