Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక ఠాగూర్ విద్యాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు రైతులుగా, రైతు కూలీలుగా, మహిళా కూలీలుగా వేషాధారణ చేశారు. నాగలి, ఎడ్ల బండి, పారలు, గంపలు, కొడవళ్ళను ప్రదర్శించారు. పొలాలను అచ్చు కట్టడం, నీరు తడపడం, నాట్లు పెట్టడం, కోత కోయడం లాంటి విషయాలను పాఠశాల ఉపాధ్యాయ బందం విద్యార్థులకు బోధించారు. మోడల్ రైతు బజారును ప్రదర్శించారు. రైతుల దీనావస్థను నత్యాల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పెద్ది నరేందర్, ఉపాధ్యాయులు పి పద్మ, ఎస్ జ్యోతి, చరణ్య, స్వాతి, సుధారాణి, రమాదేవి, దివ్య, దశరథ తదితరులు పాల్గొన్నారు.