Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
టీఆర్ఎస్ ప్రభుత్వంలోని పండుగలకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను గౌరవిస్తుందని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని చిన్న రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన క్రిస్మస్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పాస్టర్ లతో కలిసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద మధ్యతరగతి కుటుంబాలు పండుగలు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వారికి కానుకలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ నెంబర్ తీగల జాన్ శాస్త్రి, గ్రంథాలయ చైర్మన్ రేకుల భద్రాద్రి, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ బోర్ర సుధాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెళ్లి రామారావు యాదవ్, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.