Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
పాఠశాల ,కళాశాల విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు గాను విద్యా కేంద్రాల వద్ద ఉదయం, సాయంత్రం పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ సంఘం నకరేకల్ నియోజకవర్గ డివిజన్ కార్యదర్శి ఆమని గంటి గోపీనాథ్ మండల అధ్యక్షులు మొహమ్మద్ తన్వీర్ లు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన స్కూల్ సర్వేలో పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటికి వెళ్లే సందర్భంలో బయట చాలా సమయం వరకు వేచి ఉండడంతో వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం ,కాలినడకన వెళ్తున్నటువంటి అమ్మాయిలపై దాడి చేయడం లాంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సంఘటనల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాద కారకంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మచ్చ గిరి, బి.స్వామి, శివ, సురేష్ పాల్గొన్నారు.