Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పట్టణకేంద్రానికి చెందిన పడమటి అన్విత చలికాలంలో మౌంట్ ఎల్బ్రస్ పర్వతమేక్కిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సష్టించనదుకు గురువారం రాక్ క్లైంబింగ్ స్కూల్ వద్ద రాక్ క్లైంబింగ్ స్కూల్ సిబ్బంది , స్పందన కళా సమితి కార్యదర్శులు ఆవుల వినోద్ కుమార్, సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి , ఆర్డీవో భూపాల్ రెడ్డి , జిల్లా యువజన , క్రీడల శాఖ అధికారి శ్రీ కె ధనంజనేయులు , జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ కష్ణప్రియ, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ జయశ్రీ , స్థానిక కౌన్సిలర్ స్వామి , హెరిటేజ్ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఎవరెస్ట్ పర్వతారోహకులు, రాక్ క్లైంబింగ్ స్కూల్ పూర్వ విద్యార్థులు అయినటువంటి మాలావత్ పూర్ణ ఆనంద్ , టింజన్ అవార్డు గ్రహీత శేఖర్ బాబు , నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ , అంగన్వాడి టీచర్లు, పాల్గొన్నారు.