Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మతిచెందిన సంఘటన గురువారం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. .మతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నిడుమనురు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన తిరీష్ కుమార్ (26) గత మూడు రోజులనుండి కడుపునొప్పితో బాధపడుతూ గురువారం ఉదయం పదకొండు గంటలకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో చేరారు. తిరీష్ కుమార్ చికిత్స పొందుతూ సాయంత్రం మతి చెందాడు. మతుడి బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవడం వల్లనే తన కుమారుడు మతి చెందాడని మతుని తండ్రి కోటేష్ తెలిపారు. డాక్టర్ల వల్లే మతి చెందాడని ఆగ్రహించిన మతుని బంధువులు ఆస్పత్రిలో డోరు అద్దాలు పగులగొట్టి వీరంగం సష్టించారు. ఈ విషయం తెలుసుకున్న టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడ్తామని మతుని బంధువులు సముదాయించి శాంతింపజేశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు.