Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధనవత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో 100 సభ్యత్వాలు దాటినా బూత్ ఎన్రోలర్ కి ఘనంగా సన్మానించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తొలి సారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ సభ్యత్వ ప్రక్రియలను చేపట్టిందన్నారు. సభ్యత్వం నమోదు చేసిన ప్రతి కార్యకర్తలకు రెండు లక్షల భీమా సౌకర్యం కల్పిసోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఎస్టీ సెల్జిల్లా అధ్యక్షులు ధనవత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీలు మోహన్ బాబు, వనజ హన్మంత్ రెడ్డి, ప్రతిభ రాజేష్ నాయక్,మండల మహిళా శాఖ అధ్యక్షురాలు ఐనాల చేతన్య మహేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి డోంకేనా వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ బిచ్చు నాయక్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పట్టు నాయక్,మండల మైనారిటీ సెల్ అసద్ బ్గీ,తుర్కపల్లి టౌన్ అధ్యక్షులు సోమల వెంకటేష్, మండల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బానోత్ వినోద్ నాయక్,ఉపసర్పంచ్ వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు నారాయణ,తదితరులు పాల్గొన్నారు.