Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని జనవరి 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి డీసీహెచ్ ఎస్ డాక్టర్ మాత, ఆర్ఎంఓ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ,కాంట్రాక్టర్లకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ శానిటేషన్ స్వీపర్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు లకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్నారన్నారు. ఒకే రకమైన పని చేస్తున్నప్పటికీ రెండు రకాల వేతనాలు ఇస్తూ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. కార్మిక శాఖ విడుదల చేసిన జీవో 68 గాని, 11వ పీఆర్సీ జీవో నెంబర్ 60 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరి 5 నాటికి ప్రభుత్వం చర్చలు జరిపి వేతనాలు పెంచుకుంటే ఒకరోజు సమ్మె చేస్తామని హెచ్చరించారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరిలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అనంతరం కాంటాక్ట్ కార్మికుల నూతన కమిటీని అధికారులకు పరిచయం చేశార. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ యూనియన్ అధ్యక్షులు మునగ వెంకన్న ,ఉపాధ్యక్షులు పర్వతం రామయ్య, కోశాధికారి మారం నాగమణి, కందుల అండాలు వల్కి లలిత అంబటి కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులు స్వేచ్ఛగా పంటలు వేసుకోనే అవకాశం కల్పించాలి
చిట్యాల : వరి పంట చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని మేకల లింగయ్య, స్మారక భవనంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎప్సీఐ ద్వారా యాసంగి పంట కొనడానికి సుముఖంగా లేదన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపై ఆంక్షలు విధిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన, పోరాటాలు రూపొందించాలని కోరారు. రైతులను స్వేచ్ఛగా పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లానాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీను ,మండల నాయకులు పామనుగుళ్ళ అచ్చాలు, నారబోయన శ్రీనివాసులు, కత్తుల లింగస్వామి, ఐతరాజు నర్సింహ, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు,గుడిసె లక్ష్మీ నారాయణ, మాదరబోయ్న వెంకన్న, లడే రాములు, జయమ్మ పాల్గొన్నారు.