Authorization
Fri April 11, 2025 10:16:54 pm
నవతెలంగాణ - ఆలేరురూరల్
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ధూపటి వెంకటేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. వెంటనే రుణమాఫీ చేయాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెబుతారన్నారు.