Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
మనుస్మృతి దహన దినోత్సవం సందర్భంగా శనివారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మతి ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి మాట్లాడుతూ తమ పోరాటం కేవలం అంటరానితనం మీదే కాకుండా అనాగరిక వ్యవస్థ నిర్మాణానికి కారణమైన చాతుర్వర్ణ వ్యవస్థను నేలమట్టం చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జె.నర్సింహారావు, షేక్ జహంగీర్, కొండేటి ఉపేందర్, ముక్తార్ అహ్మద్, పవన్, వినరు తదితరులు పాల్గొన్నారు.