Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి గాదరి మారయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేను లయన్స్క్లబ్ సభ్యులు శనివారం నల్లగొండలోని ఆయన ఇంటి వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా మారయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇమ్మడి వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.కృష్ణమాచారి, కోశాధికారి, గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్, లయన్ సభ్యులు సంకేపల్లి నరోత్తమరెడ్డి, అయిత శ్రీనివాస్, టి.శ్రీనివాస్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.