Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-వలిగొండ
చేనేత పరిశ్రమపై జీఎస్టీ 12 శాతంగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో చేనేత పరిశ్రమపై ఆధారపడి పని చేస్తున్న సుమారు లక్ష మంది కార్మికులు రోజువారిగా పని లేక అనేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. పెంచిన జీఎస్టీతో చేనేత రంగం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి ఏర్పడుతుందని, చేనేత కార్మికుల ఆకలి బాధలు, ఆత్మహత్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్కూరి రాంచందర్, కూర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, కొండే కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.