Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూర్
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తండ్రి మారయ్య ఇటీవలే మృతి చెందారు. ఈ మేరకు శనివారం నల్లగొండలో ఆయన నివాసంలో మోత్కూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యేను పరామర్శించారు. ఈ సందర్భంగా మారయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు వెల్మినేటి జహంగీర్, ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.షాకీర్, గౌరవ సలహాదారులు కడారు నర్సింహారెడ్డి, సభ్యులు దబ్బెటి సోంబాబు, పంగ నర్సింగరావ్, కూరేళ్ల వెంకట్, ఈదునూరి కృష్ణ, గుండు ప్రసాద్, ముషం శ్రీను, కూరేళ్ల విష్ణు, మోత్కూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.