Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కంచి మధు తల్లి మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య శనివారం ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహా, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఏజాస్, మాజీ సర్పంచ్ నంగునూరి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.