Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో మనుధర్మ శాస్త్రం ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్రావు మాట్లాడుతూ దేశంలో కుల అంతరాలను సృష్టించడానికి, అసమానతలు పెంచడానికి, కుల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించిన మను ధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, కేవీపీఎస్ మండల నాయకులు కోదాటి సైదులు, ధీరావత్ సైదా, గుర్రం మేసు, దోరేపల్లి వెంకటేశ్వర్లు ఎం.రాము తదితరులు పాల్గొన్నారు.