Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వేంల
మండల పరిధిలోని ఖాసీంపేటలో గల బేతస్థ మినిస్ట్రీస్ ప్రార్ధనా మందిరంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేతేస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగల్లో క్రిస్మస్ ఒకటన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లేటి సైమన్‌రాజ్, నకిరేకంటి సైమన్, బొంత శేఖర్, ఆదిమల్ల బాబు, పుల్లెంల ప్రసాద్, అంబేద్కర్, తీతు, దావీదు, ఉపేందర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : మండలంలోని దిర్శించర్ల గ్రామంలోని ఉప్పుల లేవి మెమోరియా సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామాపురంలోని రోమన్ కేథలిక్ చర్చిలో ఫాదర్ సాగర్ రాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాపోలు నర్సయ్య, చిట్యాల బాబు, నందిపాటి నరహరి, పెదపంగ భుజంగరావు, చిట్యాల మోష, పాతకోటి పెద లాజర్, నన్నెపంగ నాగయ్య, చిట్యాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, పెద్దపడిశాల ఎంపీటీసీ కొర్న నరేష్, ఆయా గ్రామాల పాస్టర్లు పాల్గొన్నారు.
సూర్యాపేట : క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని 45వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం తమ వార్డులోని ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ.5000 చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. 20 మందికి 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రిజినల్ చైర్మెన్ నూకల వెంకట్‌రెడ్డి, మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సెక్రెటరీ ఆంగోత్ భావ్‌సింగ్, అనంతుల రవి, డొగుపర్తి ప్రవీణ్, తేరెట్పల్లి సతీష్,బెజగం ఫణి, బజ్జురి శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : క్రిస్మస్ పండుగ సందర్భంగా మండలంలోని గుండ్లగూడెం గ్రామంలోని సీఎస్ఐఆర్ చర్చిలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్‌రెడ్డి 30 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజరుకుమార్, ఎన్ఎస్యూఐ మండల ప్రెసిడెంట్ విక్రమ్, మండల యూత్ నాయకులు భాస్కర్, లోకేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని సారాజిపేట గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ బండ పద్మ పర్వతాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ రచ్చ రామ నర్సయ్య, ఉప సర్పంచ్ మహేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, సోషల్ మీడియా మండల కన్వీనర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు శ్రీధర్, సురేష్ నాయకులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి టౌన్ : పట్టణంలో బిలివర్ చర్చిలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ పీసీసీ కార్యదర్శి తంగళ్లపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో క్రైస్తవ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు పచ్చర్ల హేమలత జగన్, నజీమాసలావుద్దీన్, టీపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీయొద్దీన్, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అంగడి నాగరాజ్, పట్టణ ఉపాధ్యక్షుడు పోకల యాదగిరి, హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మద్దిరాల : మండలంలోని అన్ని గ్రామాల్లోని చర్చిల్లో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం సర్పంచ్ బరపటి ఉపేందర్, ఎంపీటీసీ నాగేల్లి శ్రీలతశ్రావణ్కుమార్, నాయకులు సుధాకర్‌రెడ్డి, ముచ్చ రఘు, సీఈవో శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలోని 14వ వార్డులో, లక్కారం పరిధిలోని చర్చిలో మహానయిమ్, లివింగ్ గార్డ్ చర్చిల్లో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజులు కేక్ కట్ చేసి చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, కౌన్సిలర్లు కాసర్ల మంజులశ్రీనివాస్రెడ్డి, సందగల్ల విజయసతీశ్గౌడ్, పాస్టర్ కె.డేవిడ్ పాల్గొన్నారు.
అర్వపల్లి : క్రిస్మస్ సందర్భంగా మండల పరిధిలోని రామన్నగూడెం చర్చిలో శనివారం ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నర్సయ్య యాదవ్ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రేకలరాణి సైదులు, పాస్టర్ చంద్రశేఖర్, పూల సైదులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సూర్యాపేట : పట్టణంలోని బాప్టిస్ట్ చర్చి, సెయింట్ బాప్టిస్ట్ చర్చి, మన్నా చర్చిలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, గండూరి ప్రకాష్, స్థానిక వార్డు కౌన్సిలర్ జ్యోతి, శ్రీవిద్యకరుణాకర్, వివిధ చర్చిల పాస్టర్లు మామిడి శ్యామ్సన్, కౌన్సిలర్ భరత్ మహాజన్, ఊట్కూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.