Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి రూరల్
మండలంలోని బండ రామారం గ్రామానికి చెందిన నల్లమాస బాలమ్మ మృతి చెందింది. ఈ మేరకు మృతు రాలి కుటుంబ సభ్యులకు దత్తాత్రేయ ఫౌండేషన్ తరఫున గుండేటి విజయ సహకారంతో శనివారం రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నానం పద్మకృష్ణగౌడ్, ఉప సర్పంచ్ యాట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా పీఏసీఎస్ చందుపట్ల బ్యాంకు తరపున రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఇన్చార్జి సీఈవో నల్లమాస రాములు, డైరెక్టర్లు బూరుగు సౌజన్యలక్ష్మారెడ్డి, సిబ్బంది గుర్రం నాగరాజు, రైతులు పాల్గొన్నారు.