Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిపాలడుగు నాగార్జున
నవతెలంగాణ-నల్లగొండ
భారతదేశ పీడిత ప్రజలకు ఒక విమోచన దినోత్సవం ధర్మం పేరుతో కొనసాగుతున్న అనాగరికమైన వివక్షాపూరిత సమాజాన్ని ధ్వంసం చేస్తామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని భాస్కర్టాకీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మతి ( మనుధర్మశాస్త్రాన్ని )ప్రతులను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావం పరిమళించే ఒక నవనాగరిక సమాజాన్ని నిర్మించేందుకు పునాదులు వేసిన రోజు 1927 డిసెంబర్ 25 అని అన్నారు.మహ్మద్ చెరువులో నీటిని తాకరాదు జంతువులు పశువులు కూడా ఆ గ్రామంలో తిరగొచ్చు కానీ దళితులను ముట్టుకునే వీలులేదని చెప్పే మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలని పదివేల మందితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దహనం చేశారని పేర్కొన్నారు.కానీ మనుస్మతి దహనం చేయడానికి సెంటుస్థలం కూడా ఇవ్వకుండా బ్రాహ్మణులు బ్రిటీష్ వారు కోర్టులు ఆంక్షలు విధించి అడ్డగించగా మహద్ గ్రామంలో పట్ఠేఖాన్ అనే ముస్లిం కు చెందిన స్థలంలో మనుస్మతిని దహనం చేశారని తెలిపారు.అనాగరిక వ్యవస్థ నిర్మాణానికి కారణం ఆయన చాతుర్వర్ణ వ్యవస్థను నేలమట్టం చేయడమే మా లక్ష్యమన్నారు.నేడు దేశంలో మత ఛాందసవాదుల నిజమైన ఈ అస్పశ్యతను ధ్వంసం చేసేందుకు శాయశక్తులా కషి చేస్తామన్నారు.సమానత్వానికి కషి చేస్తూనే సామాజికవనరుల్లో అంటరానితనం, వివక్షను పాటించకుండా కులనిర్మూలనకు కషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహయ కార్యదర్శి గాదె నర్సింహ, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి,ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కందులమోహన్,ఎస్సీ, ఎస్టీ విద్యార్థిసంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెలశివకుమార్, ఇంటి తెలంగాణవిద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి,అద్దంకి రవీందర్, బొల్లు రవీందర్‌కుమార్,పెరిక కృష్ణ, అద్దంకి దశరథ, విజరుకుమార్, సాగర్, ఇస్తారి, రుద్రాక్షి యాదయ్య పాల్గొన్నారు.