Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
నైతికవిలువలు పాటించకుండా తెలంగాణ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని, నియంతపాలనను కొనసాగనివ్వమని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.శనివారం మండలపరిధిలోని అమీనాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్లసమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వశాఖలతో క్షేత్ర పరిశీలన లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా వరి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో ఎఫ్ఏక్యు నిబంధనలకు లోబడి ఉన్నపటికీ తాలు శాతం అధికంగా ఉందన్నారు. కొనుగోలుకేంద్రాలు రైతులను వెనుకకు పంపే పరిస్థితి నెలకొన్నదని దీంతో దళారులు దీనిని ఆసరా చేసుకుని రైతుల వద్ద దాన్యం కొనుగోలు చేస్తున్నారని మిల్లర్ లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు.ఇందులో భాగంగా తమ ప్రభుత్వంలో జర్నలిస్టులకు విలువలతో కూడిన గౌరవాన్ని ఇచ్చామని నేటి తెరాస ప్రభుత్వంలో వారికి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని జర్నలిస్టుల సమస్యలు తీర్చలేదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలఅధ్యక్షులు ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.