Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కామిశెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం తొలగించినందుకు నిరసన తెలిపారు.రోడ్డు విస్తరణ పనులు పూర్తి అయిన తర్వాత తిరిగి వైఎస్ఆర్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్ఠ చేయాలని ఆర్ అండ్‌బీ డీఈ ప్రవీణ్‌రెడ్డిని డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటు ఆలస్యమైనట్టయితే తిరిగి ఆందోళన తప్పదని హెచ్చరించారు. రోడ్డు విస్తరణ పనులపేరుతో తమకు సమాచారం లేకుండా విగ్రహాలను తొలగించడం దుర్మార్గమన్నారు.వైఎస్ చిత్రపటం ఉన్న బోర్డును ఏర్పాటు చేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ చింతలపాలెం మండలం అధ్యక్షుడు రాధారెడ్డి,మఠంపల్లి మండల అధ్యక్షుడు బులుసు రవి, నాయకులు సుతారి శ్రీనివాస్,షేక్ ఉపేందర్, వేముల రాజు,జడ సాయి, ఆనందరావు, వెంకటేశ్వర్లు, లావుడియా రాజేష్, రమేష్ పాల్గొన్నారు.