Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
కేంద్రప్రభుత్వ వినియోగదారుల ఆహార వ్యవహారాలు ప్రజా పంపిణీ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్సార్, ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమావేశం నిర్వహి ంచారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ బి.చంద్రయ్య పాల్గొని నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఏ .హిమగిరి 28 సంవత్సరాలుగా వినియోగదారుల రక్షణచట్టంపై గ్రామీణ స్థాయి నుండి ప్రజలను చైతన్యం చేయడం, వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేస సమస్యలను పరిష్కరించడానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవా అవార్డు అందజేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉస్మానియా లా డిపార్ట్మెంట్ చైర్పర్సన్ ఎం.వెంకటేశ్వర్లు, నల్సార్ యూనివర్సిటీ వినియోగదారుల చైర్పర్సన్ డాక్టర్బాలకష్ణ,క్యాట్కో అధ్యక్షులు వేముల గౌరీశంకర్, కార్యదర్శి శంకర్లాల్సౌర్య, మందడి కష్ణారెడ్డి పాల్గొన్నారు.