Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2021-22 పోటీలకు బయల్దేరిన గాంధీజీ విద్యార్థులు
రాష్ట్రానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలి
న్యూమాక్స్ కుంగ్‌ఫూ అసోసియేషన్ ఆఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడి శ్రీనివాసులు
నవతెలంగాణ-చండూరు
చండూరు, నాంపల్లిలలోని గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు తొమ్మిది మంది రాజస్థాన్ రాష్ట్రంలోని నోబెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఈనెల 28 వ తేదీ నుండి 31 వరకు జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్ షీప్ పోటీలలో పాల్గొనుటకు శనివారం బయల్దేరారు.గత నెల 23, 24వ తేదీలలో జరిగిన జిల్లా స్థాయి డ్రాప్-రోబాల్ చాంపియన్ షీప్ పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు నేరెడ్డి భరత్, నేతల మనోజ్, నేతాళ మణికంఠ, పోగుల శంకర్‌రెడ్డి, వట్టికోటి సాయికిరణ్, సపావత్ రాజ్‌కుమార్, గోపు కార్తీక్, మహమ్మద్ రుక్సార్, పసుపులేటి ధరణీ ధరుణ్ మొదలగు విద్యార్థులు బయల్దేరే ముందు గాంధీజీ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యూమాక్స్ కుంగ్‌ఫూ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల అలవడతాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాఠశాల స్థాయి నుంచే ఎదిగారన్న విషయం పాఠశాల విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలన్నారు.రాష్ట్రం తరఫున గాంధీజీ విద్యా సంస్థల నుండి జాతీయస్థాయి చండూరు డ్రాప్-రోబాల్ పోటీలకు బయల్దేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆటలో ప్రావీణ్యం కనబర్చి, విజయం సాధించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, నాంపల్లి గాంధీజీ స్కూల్ ప్రిన్సిపాల్ బందనాధం సురేష్, చండూరు గాంధీజీ స్కూల్ ప్రిన్సిపాల్ చెరిపెల్లి రామయ్య, కోచ్‌లు మహమ్మద్ రహమత్, పాలకూరి గణేష్,బోడ లక్ష్మణ్ ఉపాధ్యాయుల, విద్యార్థులు పాల్గొన్నారు.