Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్బీఐ సష్టికర్త డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెట్టాలని కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధనసమితి జాతీయ అధ్యక్షులు జెర్రిపోతుల పరుశరామ్ పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞానయుద్ధ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా అంబేద్కర్ విగ్రహం నుండి నవంబర్ 26న ప్రారంభమై శనివారం జిల్లాకేంద్రానికి చేరింది. సందర్భంగా అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలేసి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహి ంచారు.జ్ఞాన యుద్దయాత్ర సభ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ,ఎస్టీ విద్యార్థిసంఘం రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు కట్టెలశివకుమార్ అధ్యక్షత వహించగా కరెన్సీపై అంబేద్కర్ ఫొటోసాధన సమితి సీఏపీఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు జెర్రిపోతుల పరుశరామ్ మాట్లా డుతూ అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదన్నారు. భారత రాజ్యాంగం లేకుంటే ఈ రాజ్యమే లేదన్నారు. అలాంటి మహానుభావున్ని ఈ ప్రభుత్వాలు తన చరిత్రను మరిచిపో తుందన్నారు.అందుకోసమే ఈ పార్లమెంటు సమావేశాల్లో కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని, పార్ల మెంట్లో బిల్లు పెట్టాలని కోరారు. నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని కోరారు. ముఖ ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు పెరిక కృష్ణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రేఖల సైదులు, బీఎస్పీ జిల్లా నాయకులు గోవర్ధన్, తెలంగాణ స్టూడెంట్ యూని యన్ జిల్లా అధ్యక్షులు కొడేంటి మురళి, మాలల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి ఎర్ర శ్రీను,కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జ్ఞాన యుద్దయాత్ర బందం తేర్యాల సందీప్, కొమ్మగల్ల మచ్చగిరి, గుర్కు ప్రశాంత్, మధు పాల్గొన్నారు.