Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
అకాలవర్షం ,తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రకతి విపత్తు కారణంగా ఎకరానికి రూ.లక్ష పరిహారం అందించాలని మండలంలోని సుంకిశాలతండాకు చెందిన రైతులు సోమవారం ్ల జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ ఖరీఫ్‌లో అకాలవర్షాలు, వైరస్, తామర, ఇతర తెగుళ్లు సోకి మిర్చి పంట మొత్తం దెబ్బతిన్నదన్నారు.వర్షాలకు పూతకాయలు రాలి పోయి 90 శాతం పంటదెబ్బ తిన్నది ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే సాగర్ ప్రాజెక్టు పునారావాసం కింద సాగు చేస్తున్న భూములకు ఇంత వరుకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదన్నారు.తమ భూములను రెవెన్యూ రికార్డుల్లోకి, ధరణి వెబ్సైట్లో నమోదు చేయలేదని విన్నవించారు.