Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
.మండలకేంద్రంలోని అంబేద్కర్ యువజనసంఘంఆధ్వర్యంలో ప్రధానచౌరస్తా రోడ్డు విస్తరణలో భాగంగా పునర్నిర్మించడానికి అంబేద్కర్ యువజన సంఘం కొత్త నిర్మాణం జరిపి విగ్రహం నిర్మించగా బండ పుల్లారెడ్డి ఆ విగ్రహాన్ని తొలగించాలని పనులకు అడ్డుపడుతున్నాడని,అతనిపై చర్యలు తీసుకోవాలనికోరుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రధానరహదారిపై రాస్తారోకో చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నన్నెపొంగుసైదులు మాట్లాడుతూ బండా పుల్లారెడ్డి ఆర్అండ్బీ రోడ్డును ఆక్రమిస్తూ కిరాయిలు వసూలు చేస్తున్నాడని ఆరో పించారు.వెంటనే అతన్ని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బాధ నర్సయ్య, కొత్తపల్లి రవి,మైసయ్య, నెమ్మాది వెంకటేశ్వర్లు, పి.సైదులు, విజరుకుమార్, హుస్సేన్, వెంకన్న, చంటి, నరేష్ ,సాయికిరణ్ పాల్గొన్నారు.