Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగు నీరందించే ఉద్దేశంతో అందించే భగీరథ నీటిని ప్రజలందరూ బాధ్యతా యుతంగా వాడుకోవాలని కమ్మగూడ, మేటి చందాపురం సర్పంచులు మార్నేని నిర్మలలూర్థయ్య, జంగిలి లక్ష్మీప్రసన్నరవి అన్నారు. సోమవారం ఆ గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి వాడకంపై ఆర్డబ్య్లూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటికి సరిపడా నీరు పట్టిన తర్వాత నల్లను పూర్తిగా కట్టి వేయాలని సూచించారు. నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడే వాటిని మరింత అద్భుతంగా రాబోయే తరాలకు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు షాకీర్అలీ, మల్లేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.