Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ప్రభుత్వం ఉపాధిహామీ చట్టం ద్వారా ఆసక్తి గల రైతులకు చెరువుల నిర్మాణానికి సహకారాన్ని అందిస్తుందని, యువత సద్వినియోగం చేసుకువాలని ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గడ్డిపల్లిలోని కేవీకేలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక యువతకు జాతీయ మత్స్యఅభివద్ధి మండలి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహ కారం,సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్పబ్లిక్ సిస్టమ్ హైదరాబాద్ వారి సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు.యువత వత్తి నైపుణ్యత శిక్షణ పొంది చేపల పెంపకం చేపట్టడం, చేపలమార్కెటింగ్ మొదలగు అంశాలలో ఉపాధిని పొందొచ్చ న్నారు.కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, హెచ్ బి.లవకుమార్ మాట్లాడుతూ జిల్లాలో నీటివనరులు సమద్ధిగా ఉండడంతో యువత చేపలపెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు.తదుపరి 15 రోజుల పాటు చేపల పెంపకం విలువధారిత ఉత్పత్తుల తయారీ, క్షేత్ర సందర్శన తదితరఅంశాల గురించి వివరించారు. శ్రీ అరబిందో స్కూల్ ప్రిన్సిపాల్ గోవర్థన్ మాట్లాడుతూ వత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువత చేపల పరిశ్రమలో ఉపాధి, స్వయం ఉపాధిని పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు నరేష్, ఏ. కిరణ్, డి.నరేష్, టి.మాధురి, డి.ఆదర్శ్, సైదులు,ప్రభాకర్, శ్రీను, జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యువత శైలజ, స్రవంతి, పుష్ప, సుప్రిత, విమల,మట్టయ్య, అంబేద్కర్, రాంబాబు, నరేష్, రాజ్కుమార్తో పాటు 30 మంది పాల్గొన్నారు.